కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ఫస్ట్ వేవ్ తో పోల్చితే… సెకండ్ వేవ్ లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. చూస్తుండగానే వందల్లో ఉన్న కేసులు లక్షల్లోకి వచ్చేశాయి. కరోనా వైరస్ తనను తాను రూపం మార్చుకున్నట్లుగానే… వైరస్ సోకిన వారికి కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.
వైరస్ నియంత్రణకు వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా పెను ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకు కరోనా లక్షణాలుగా జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచిని కోల్పోవడం, చలిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపించేవి. కానీ ఇప్పుడు మరికొన్ని లక్షణాలను గుర్తించారు. గులాబీ కళ్ళు, గ్యాస్ట్రోనమికల్ పరిస్థితులు, వినికిడి లోపం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణాలను తేలికగా తీసుకోకూడదని వీరు హెచ్చరిస్తున్నారు.