సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎప్పటి వరకు కలిసి ఉంటాయో, ఎప్పుడు విడాకుల వరకు వెళ్తాయో ఎవరూ చెప్పలేరు. అలా అని చివరి వరకు కలిసి ఉన్నవారు లేకపోలేదు. అయితే… కలిసి ఉన్న వారికన్నా విడిపోయిన వారే ఎక్కువ. ఇప్పుడా లిస్ట్‌లో మరో జంట చేరింది.
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్వేతాబసుప్రసాద్, రోహిత్ మిట్టల్ జంట విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. పెళ్లై యేడాది తిరక్కుండానే ఈ జంట విడాకులు తీసుకుంది. గతేడాది డిసెంబర్ 13న వీరి వివాహం జరిగింది. రోహిత్‌తో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి… కొన్ని కొన్ని సార్లు ఇలా జరిగిపోతాయి. అంతా మన మంచికే అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది.