టీఆర్ఎస్‌లో అసంతృప్త ఎమ్మెల్యేల లిస్ట్ పెరిగిపోతుంది. మంత్రివర్గ విస్తరణ పూర్తయినా అసంతృప్త జ్వాలలు మాత్రం చల్లారటం లేదు. అసెంబ్లీ నడిచనన్ని రోజులు సీనీయర్ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై చర్చించుకోగా, కొంతమంది లాబీల్లో బయటపడ్డారు. తాజాగా తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు.
‘ఒకటి, రెండుసార్లు గెలిచిన వారికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేను. విప్ పదవలు, మంత్రిపదవి దక్కలేదు.. అయినా సర్దుకుంటూ వచ్చాను. అసెంబ్లీ కమిటీల్లో అయినా నా సీనీయారిటీ, లాయల్టీకి పెద్దపీట వేస్తారని భావిస్తే, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సబ్యునితో సరిపెట్టారు’ అంటూ కార్యకర్తల సమావేశంలో కంటతడి పెట్టారు విద్యాసాగర్‌రావు.