ఏపీలో ఐఏఎస్ లకు జైలుశిక్షలు కామన్ అయిపోయాయి. తాజాగా మరో ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఐఏఎస్ లు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలను కోర్టు ధిక్కరణ కేసుల్లో నిందితులుగా నిర్ధారించింది. ఈనెల 29న శిక్షలు ఖరారు చేస్తామని ప్రకటించింది.
ఐఏఎస్ పూనం మాలకొండయ్య కోర్టుకు వ్యక్తిగతంగా హజరుకావాలని కోర్టు ఆదేశించినా రాకపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పాటించలేదు. ప్రభుత్వం మరో పిటిషన్ వేసినా కోర్టు వేసింది. అయినా అభ్యర్థులకు న్యాయం జరగలేదు. దీంతో కోర్టు ఉత్తర్వులు అమలుకాకపోవటానికి ప్రధాన కారణంగా ఐఏఎస్ లు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలే అని కోర్టు తేల్చింది.
అయితే, ఈనెల 29లోపు తీర్పు అమలు చేస్తే శిక్ష తప్పే అవకాశం ఉంది. కానీ ఇందుకు ప్రభుత్వం సమ్మతిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు కోర్టు ధిక్కరణ కేసుల్లో ఇరుక్కున్నారు.