తమిళ సినిమా అసురన్ కు రీమేక్ గా వస్తున్న మూవీ నారప్ప. హీరో విక్టరీ వెంకటేష్ ఈ మూవీ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి, కొడుకుగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. శ్రీకాంత్ అడ్డాల శైలిలో పోస్టర్ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమా నుండి మరో అప్డేట్ కూడా వచ్చేసింది. వచ్చే సమ్మర్ లో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.