పెళ్లైన తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు తీస్తున్న హీరోయిన్ సమంత. సమంత చాలా కాలం గ్యాప్ తర్వాత శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, గతంలో ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్ అయ్యింది.
తాజాగా చిత్ర యూనిట్ నుండి అప్టేట్ వచ్చింది. షూటింగ్ లో భాగంగా శివపూజ చేసిన సీన్ చేశారు. దీన్ని పోస్ట్ చేసిన నిర్మాత నీలిమా గుణ… శివపూజ షూట్ చేసిన రోజే సోమవారం కూడా అంటూ ఫోటో షేర్ చేసింది.
శాకుంతలం సినిమాను గుణశేఖర్ డైరెక్ట్ చేస్తుండగా, మలయాళం హీరో దేవ్ మోహన్ దుశ్యంత్ పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Monday today and coincidentally we are to shoot Shiv Pooja 🙏 ✨🤍#Shaakuntalam @Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan @GunaaTeamworks @DilRajuProdctns pic.twitter.com/FclkpNb0EY
— Neelima Guna (@neelima_guna) March 29, 2021