నీది నాది ఒకే కథ సినిమాతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల దర్శకత్వంలో.. దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న విరాటపర్వం సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం అయింది. ఈ నెల 17 న అన్ని థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా.. నక్సలిజానికి ప్రేమకథను జోడించి రూపొందించబడింది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మూవీ మేకర్స్. వరుస అప్డేట్ లతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా మరో బిగ్ అప్‌డేట్ ను ప్రకటించారు మూవీ మేకర్స్.
ఈ చిత్రంలో స్వయంగా రానా ఆలపించిన ఛలో ఛలో అంటూ సాగే వారియర్ సాంగ్ ను ఆదివారం విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక సినీ పరిశ్రమలోని ప్రముఖులకు వరుసగా ప్రీమియర్ షోలు వేస్తున్నారు విరాట పర్వం మూవీ మేకర్స్. యంగ్ హీరోలు నిఖిల్, సిద్దూ జొన్నలగడ్డ వంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి మంచి కితాబిచ్చారని చెప్తున్నారు.
అయితే.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, నివేద పేతురాజ్, సాయిచంద్ వంటి ప్రముఖులు నటించడంతో ప్రజలను ఆకట్టుకుంటోందంటున్నారు సినీ ప్రముఖులు.