మన్మథుడు సినిమాలో నాగార్జున సరసన చేసిన అన్షు గుర్తుందా ? ఆ మూవీలో ఆమె యాక్టింగ్‌తో మాత్రమే కాకుండా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించలేదు. పెళ్లి చేసుకుని స్థిర పడింది. కానీ త్వరలో ఈమె మళ్లీ మూవీల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో రానున్న ఓ మూవీలో అన్షు నటిస్తుందని తెలిసింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్‌టీఆర్‌లు ఓ మూవీ చేయనున్నారు. కాగా అందులో ఓ కీలకపాత్రకు త్రివిక్రమ్ అన్షును తీసుకోవాలనుకున్నారట. ఈ క్రమంలోనే అన్షును ఇందుకు సంప్రదించినట్లు తెలిసింది. దీంతో త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఆ మూవీలో అన్షు నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
ఇక త్రివిక్రమ్ అప్పట్లో మన్మథుడు మూవీకి స్క్రిప్ట్ అందించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అందులో అన్షు అందరినీ ఆకట్టుకుంది. తరువాత ఆమె ప్రభాస్‌తో రాఘవేంద్ర మూవీలోనూ నటించింది. 2004లో వచ్చిన భూమిక మూవీ మిస్సమ్మలోనూ అన్షు చివరిసారిగా కనిపించింది. ఆ తరువాత ఆమె లండన్‌కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తే 17 ఏళ్లు అవుతుంది. ఇంతటి సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ వెండి తెరపై కనిపించనున్న అన్షును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.