నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాకు దాదాపు 90శాతం పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయితే కలెక్షన్లు మాత్రం దీనికి కంప్లీట్ రివర్స్ లో వచ్చాయి. ఎందుకో తన ప్రచారంతో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేకపోయాడు నాని. ఓ సగటు మీడియం రేంజ్ సినిమా కంటే తక్కువగా నాని సినిమాకు వసూళ్లు వచ్చాయి.
అంటే సుందరానికి సినిమాకు మొదటి రోజు 3 కోట్ల 87 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. నాని సినిమాలకు, అతడి సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా తక్కువ. ఈ వీకెండ్ ఈ సినిమాకు భారీ వసూళ్లు రావాల్సి ఉంది. లేదంటే బ్రేక్ ఈవెన్ కష్టమే.
వరల్డ్ వైడ్ ఓవరాల్ గా ఈ సినిమాను 30 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 31 కోట్ల రూపాయలు రావాలి. మొదటి రోజు వసూళ్లతో కంపేర్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 25 కోట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 1.56 కోట్లు
సీడెడ్ – 38 లక్షలు
ఉత్తరాంధ్ర – 44 లక్షలు
ఈస్ట్ – 34 లక్షలు
వెస్ట్ – 34 లక్షలు
గుంటూరు – 33 లక్షలు
కృష్ణా – 28 లక్షలు
నెల్లూరు – 19 లక్షలు