నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా మరో కాస్ట్ ఫెయిల్యూర్ దిశగా దూసుకుపోతోంది. విడుదలై వారం రోజులు దాటడంతో, ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమని తేలిపోయింది. వారం రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల 39 లక్షల రూపాయల నెట్ వచ్చింది.
వరల్డ్ వైడ్ ఈ సినిమా 30 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. తాజా వసూళ్లతో పోల్చిచూసుకుంటే బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు కష్టసాధ్యం. బయ్యర్లకు అటుఇటుగా ఈ సినిమా 10 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చేలా ఉంది.
ఇంతకుముంది నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు కూడా ఇలానే జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడు అంటే సుందరానికి సినిమాకు కూడా హిట్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ.5.58 కోట్లు
సీడెడ్ – 1.13 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.33 కోట్లు
ఈస్ట్ – 93 లక్షలు
వెస్ట్ – 79 లక్షలు
గుంటూరు – 87 లక్షలు
నెల్లూరు – 58 లక్షలు
కృష్ణా – 84 లక్షలు