నాని హీరోగా నటిస్తున్న సినిమా ”అంటే.. సుందరానికీ”. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. నాని నుంచి వినోదం ఆశించే ప్రేక్షకులకు సుందరం పాత్ర కావలసినంత ఎంటర్ టైన్ మెంట్ పంచుతుందనే భరోసా ఈ టీజర్ ఇచ్చింది. ఇప్పుడీ సినిమా టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది.
‘అంటే.. సుందరానికీ’ టీజర్ రికార్డ్ వ్యూస్ సాధించింది. కేవలం 24 గంటల్లో టీజర్ కు 11 మిలియన్ల వ్యూస్ దక్కాయి. నాని కెరీర్ బెస్ట్ ఇదే. యూట్యూబ్‌లో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న టీజర్ కి 3 లక్షల 80వేలకు పైగా లైక్స్ వచ్చాయి. టీజర్ కి వచ్చిన వ్యూస్, లైక్స్ చూస్తుంటే సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధమౌతుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రంలో నానిని సుందరం అనే బ్రాహ్మణ అబ్బాయిగా చూపించాడు. క్రిస్టియన్ అమ్మాయి నజ్రియాను ప్రజెంట్ చేశాడు. టీజర్ లో లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఫ్రెష్ గా అనిపించింది. టీజర్ ని చాలా ఇంట్రస్టింగ్ గా ప్రజంట్ చేశారు. టీజర్ మొత్తం నవ్వులు పూయిస్తూనే టైటిల్ లో వున్న ”అంటే…”కి సమాధానం ప్రేక్షకుడి గెస్సింగ్ కి వదిలి ఆసక్తిని పెంచగా, కథలో మరో కీలకమైన అంశం వుందని హింట్ ఇచ్చేలా టీజర్ డిజైన్ చేయడం ఆకట్టుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా నరేష్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కన్నడ వెర్షన్ మాత్రం సిద్ధం చేయలేదు. కన్నడనాట కూడా తెలుగు కాపీనే విడుదల చేస్తున్నారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.