నాచురల్ స్టార్ నానీ నెక్ట్స్ మూవీ ‘ అంటే సుందరానికి ‘ టీజర్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రయ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.
ఈ చిత్రంలో నాచురల్ స్టార్ కు జంటగా మళయాళ భామ నజ్రియా ఫహద్ నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక రోల్స్ లో కనిపించనున్నారు.
సినిమా టీజర్ 2 నిమిషాల పాటు ఉన్న ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలో నానీ బ్రహ్మణ యువకుడి పాత్రలో నటించారు. సాంప్రదాయ పట్టింపులు ఉన బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడు. వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు వచ్చాయి. వారి ప్రేమకు కుటుంబం ఒప్పుకుందా? అని సస్పెన్స్ లో ఉంచారు.
ఈ సినిమాలో నానీ మరోసారి ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ నజ్రియా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.