నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికీ’ నుండి టీజర్ రిలీజైంది. టీజర్ అంటే సాధారణంగా నిమిషానికి అటుఇటుగా ఉంటుంది. కానీ ఈ సినిమా టీజర్ మాత్రం దాదాపు ట్రయిలర్ లానే ఉంది. అటుఇటుగా 2 నిమిషాల నిడివితో వచ్చిన ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం.
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందరం కథే ఈ “అంటే సుందరానికీ”. అతడు తన కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. ఓ క్రిస్టియన్ అమ్మాయిని ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? ఇంట్లో పెద్దల్ని ఒప్పించి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు, అదే టైమ్ లో హీరోయిన్ కూడా తన కుటుంబ సభ్యుల్ని ఎలా ఒప్పించిందనేది అనేది ఈ సినిమా స్టోరీ. ఆ విషయాన్ని టీజర్ లో క్లియర్ గా చెప్పేశారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు వివేక్ ఆత్రేయ. టీజర్లో సుందరం.. అతని ఫ్యామిలీ గురించి అలాగే లీలా అండ్ ఫ్యామిలీ గురించి చెప్తూ సుందరం-లీల మధ్య లవ్ తో వచ్చే సమస్య చెప్తూ ఫన్ ఎలిమెంట్స్ తో టీజర్ ని ఎంటర్ టైనింగ్ గా కట్ చేశారు. నాని ఎప్పట్లానే తన ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో చించేశాడు. రాజారాణి తర్వాత నజ్రియా మరోసారి ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోబోతోంది.
నానితో పాటు డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ , నికేత్ బొమ్మి విజువల్స్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జూన్ 10న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు.