కరోనా చైనాలో పుట్టిందనే అపఖ్యాతిని మూటగట్టుకున్న డ్రాగన్ దేశాన్ని మరో వ్యాధి కంగారు పెట్టిస్తోంది. అక్కడి హెబీ ప్రావిన్స్ లోని చెంగ్డేలో ఆంత్రాక్స్ న్యూమోనియా కేసు బయటపడింది. వెంటనే వ్యాధి సోకిన వ్యక్తిని బీజింగ్ కు తరలించారు. పశువులు, గొర్రెల ద్వారా ఈ వ్యాధి వచ్చినట్టు గుర్తించారు డాక్టర్లు.
ఆంత్రాక్స్ న్యూమోనియా అనేది చాలా డేంజర్. ధూళి ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. కలుషిత ఆహారం, మాంసం ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వ్యాధి సోకితే వాంతులు, విరేచనాలు, వికారంగా అనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. ఇది నేరుగా మనుషుల ద్వారా వ్యాపిస్తుంది. అయితే కరోనా మాదిరిగా అంటు వ్యాధి మాత్రం కాదు.