బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకాన్ని మే6న నిర్వహించనున్నారు. పట్టాభిషేక సమయంలో రాజ దుస్తులు ధరించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఆ సాంప్రదాయానికి స్వస్తి పలకాలని చార్లెస్-3 దంపతులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
గతేడాది సెప్లెంబర్-2న బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 మరణించారు. అనంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. ఆయన పట్టాభిషేకాన్ని మే6న నిర్వహించనున్నారు. లండన్‌లోని వెస్ట్ మినిష్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఆ మరుసటి రోజు విండ్సర్ క్యాజిల్‌లోనూ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులతో పాటు దేశంలోని సామాన్యులను కూడా అనుమతించనున్నారు.
పట్టాభిషేకం సమయంలో రాజులు పట్టు వస్త్రాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి ఆ సాంప్రదాయానికి స్వస్తి పలకాలని చార్లెస్-3 భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారి ఆయన ఆర్మీ యూనిఫాంలో పట్టాభిషేకానికి హాజరవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.