మెడికల్ స్టూడెంట్ ప్రీతి సూసైడ్ నేపథ్యంలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో బుధవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ర్యాగింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యాంటీ ర్యాగింగ్ కమిటీలోని 13 మంది సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. కమిటీ సమావేశం మధ్యలో అనస్థీషియా హెచ్ వోడీ నాగార్జున రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మోహన్ దాస్ మాట్లాడుతూ.. రాగింగ్ జరిగింది వాస్తవమేనని పేర్కొన్నారు. హరాస్మెంట్ చేసింది నిజమేనని, హరాస్మెంట్ కూడా ఒక పాటి ర్యాగింగేనని స్పష్టం చేశారు. ర్యాగింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు గురువారం యూజీసీ కమిటీకి పంపిస్తానని తెలిపారు.
యూజీసీ నిర్ణయాలు బట్టి చర్యలు ఉంటాయని వెల్లడించారు. సైఫ్ కి, ప్రీతికి విడివిడిగా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. కౌన్సిలింగ్ లో ఇద్దరు మెయిల్ ప్రొఫెసర్స్, ఇద్దరు ఫిమేల్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నట్లు తెలిపారు ప్రిన్సిపాల్ మెహన్ దాస్
కాగా.. ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనతి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. అతని సెల్ ఫోన్ లో 17 వాట్సాప్ చాట్స్ ను పోలీసులు పరిశీలించారు. అనూష, భార్గవి, LDD+Knockouts గ్రూప్ చాట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగంలో ప్రీతికి, సైఫ్ సూపర్ వైజర్ గా వ్యవహరిస్తున్నాడు.