జర్మనీలో ఓ నర్సు చేసిన పనికి అందరూ షాకయ్యారు. ప్రజలకు టీకాలు వేయకుండా సెలైన్ వాటర్ ను ఇంజెక్ట్ చేసిందామె. దాదాపు 9వేల మందికి డమ్మీ వ్యాక్సిన్ డోసులు అందించింది.
విషయం బయటకు రావడంతో దర్యాప్తు జరిపిన ఉన్నతాధికారులు ఇది నిజమేనని తేల్చారు. డమ్మీ వ్యాక్సిన్ తీసుకున్న వారిని గుర్తించారు. వారందరికీ అసలైన వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో టీకా కోసం వచ్చిన ప్రజలకు సెలైన్ వాటర్ ఎక్కించింది నర్సు. ఆ సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామంది 60-70 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఈ నర్సు వ్యాక్సిన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని గుర్తించారు పోలీసులు. అందుకే ఇలా చేసి ఉంటుందని చెబుతున్నారు.