జాతారత్నాలు సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కెవి. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు తమిళ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు, డైరెక్టర్ అనుదీప్ కె.వి హీరో శివ కార్తికేయన్ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ లపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు నిర్మిస్తున్నారు. చెన్నైలోని కారకూడిలో ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది.
ఇక ఇటీవల వరుణ్ డాక్టర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు శివ కార్తికేయన్.