ప్రముఖ రచయిత్రి జేకే రోలింగ్ రాసిన హారీపోటర్ పుస్తకాలు గుర్తున్నాయి కదా. వాటిని సినిమాలుగా కూడా తీశారు. వాటిల్లో ఒక పొడవైన చీపురు మీద కూర్చుని మంత్రాలతో వారు గాల్లో ప్రయాణం చేస్తుంటారు. ఆ మూవీలన్నీ అలాగే ఉంటాయి. అయితే ఓ వ్యక్తి కూడా చీపురుకట్ట మీద కూర్చుని ప్రయాణం చేస్తున్నట్లుగా వెళ్లాడు. నిజానికి అతను దాన్ని తన టూవీలర్‌కు కట్టి తీసుకువెళ్తున్నాడు.. కానీ.. హారీ పోటర్‌లా ఆలోచిస్తే అతను కూడా ఆ చీపురు కట్టపై అలాగే ప్రయాణిస్తున్నాడు కాబోలు అనిపిస్తుంది. ఇక ఆ వీడియోను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉత్తరాఖండ్ లో ఓ వ్యక్తి తన టూవీలర్‌కు చీపురు కట్టి అనంతరం వాహనంపై ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో దాన్ని వీడియో తీయగా.. అది నటుడు అనుపమ్‌ఖేర్‌కు కనిపించింది. దీంతో ఆయన ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశాడు. చూసేందుకు అతను హారీ పోటర్ చీపురుకట్ట మీద ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. దీంతో అనుపమ్ ఖేర్ ఆ వీడియోకు అదే తరహా కామెంట్ పెట్టాడు.
టూ వీలర్ మీద ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి వీడియో.. తక్కువ బడ్జెట్ ఉన్న ఇండియన్ హారీ పోటర్ మూవీ అని అనుపమ్ ఖేర్ కాప్షన్ పెట్టాడు. దాన్ని చూస్తే హాగ్‌వర్ట్స్ నిజంగానే తమ దుకాణం మూసేస్తారని నెటిజన్లు చమత్కరించారు. కాగా అనుపమ్ ఖేర్ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియో పట్ల కామెంట్లు పెడుతున్నారు.
Advertisements
ఇక అనుపమ్ ఖేర్ చివరిసారిగా వన్ డే, జస్టిస్ డెలివర్డ్ అనే మూవీలో నటించగా ఆ సినిమా డిసెంబర్ 2019లో విడుదలైంది. ఆయన ఇటీవలే యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే అనే పుస్తకాన్ని రాసి విడుదల చేశారు. దానికి పాఠకుల నుంచి చక్కని స్పందన లభిస్తోంది.