అనుపమ పరమేశ్వరన్ బటర్‌ఫ్లై చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 40 సెకన్ల టీజర్ చూస్తే కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్ నివసించే అనుపమ టీజర్‌లో కొన్ని షాకింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.
ఇక అనుపమ పుట్టినరోజు సందర్భంగా బటర్‌ఫ్లై టీమ్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తి రేపిన మేకర్స్ ఇప్పుడు టీజర్ తో మరింత ఆ ఆసక్తిని పెంచారు.
జెన్’నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఘంటా సతీష్ బాబు అందించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇక కెరీర్ ఆరంభం లో మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న అనుపమ ఇటీవల కాలంలో సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. మరి ఈ సినిమా అయినా అనుపమకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.