మలయాళం ప్రేమమ్ సినిమాతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ అనుపమ. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది అనుపమ. ఇక అక్కడి నుంచి వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసుకుంటూనే పోతుంది. చెప్పుకోదగ్గ హిట్ పడకపోయిన నటన పరంగా విమర్శకులను సైతం మెప్పించింది. నటనతో పాటు అనుపమ పాటలు కూడా బాగా పడుతుంది. ఎప్పుడు సోషల్ మీడియా లో యక్టీవ్ గా ఉంటూ క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా చిన్న నాటి ఫోటోలు పోస్ట్ చేస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అనుపమ.