టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గేర్ మార్చింది. వరుస సినిమాలను ఓకే చేస్తూ మంచి జోష్ మీద ఉంది. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు సినిమాలున్నాయి. నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 18 పేజీస్ చిత్రంలో అనుపమ కథానాయికగా నటిస్తోంది. దీనిని అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
మరోవైపు దిల్ రాజు బంధువు ఆశిష్ రెడ్డి హీరోగా శ్రీ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ బాయ్స్ లోను అనుపమ హీరోయిన్ గా చేస్తోంది. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇది కాక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మలయాళ చిత్రం హెలెన్ రీమేక్ విషయంలోనూ అనుపమ క్లారిటీ ఇచ్చింది. పివివి సంస్థతో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మించే హెలెన్ రీమేక్ లోను తాను నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే వచ్చే ఏడాది అనుపమ ఈ మూడు సినిమాలతో సందడి చేయబోతోంది. మరి ఈ అమ్మడికి ఎంతవరకు ఈ మూడు సినిమాలు కెరీర్ పరంగా హెల్ప్ చేస్తాయో చూడాలి.