అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. కానీ స్కిన్ షోకు దూరంగా ఉండటంతో తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ నటనలో మాత్రం అనుపమకు మంచి మార్కులు పడ్డాయి.
అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా వస్తున్న 18పేజెస్ లో నటిస్తుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. తాజాగా నిఖిల్ వల్ల మరో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి రూపొందిస్తున్న చిత్రం కార్తికేయ-2. కార్తికేయకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమను తీసుకున్నారని టాక్. ఈ నెల 26 నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతోంది.