మలయాళ సూపర్ హిట్ సినిమా “ప్రేమం”తో అందరి మనసులు దోచెయ్యడమే కాకుండా అదే సినిమా రీమేక్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన “అ ఆ” సినిమాలో నెగెటివ్ షేడ్స్‌లో నడిచే పాత్రతో పాపులర్ అయిపోయిన అనుపమ సాయిధరం తేజ్, రామ్, శర్వానంద్ వంటి యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. రీసెంట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్‌తో “రాక్షసుడు” సినిమాలో జతకట్టి డీసెంట్ హిట్ సాధించింది కూడా.
తన సినిమాలతో మాత్రమే కాకుండా అనుపమా సోషల్ మీడియా ద్వారా కూడా నెటిజన్లలో బాగానే పాపులర్ అయ్యింది. ఇండియన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా తనకు ఆన్‌లైన్ ఫ్రెండ్ కావడంతో ఈ పేస్ బౌలర్ అనుపమను తన ప్రేమలో క్లీన్ బౌల్డ్ చేసేశాడు అని పుకార్లు షికార్లు చేశాయి. ఐతే, అనుపమ మాత్రం ఒకటికి రెండుసార్లు అవన్నీ గాసిప్స్ అని, బుమ్రా కేవలం తనకు కేవలం ఒక సోషల్ మీడియా ఫ్రెండ్ మాత్రమే అని వివరణ కూడా ఇచ్చింది.
తాజాగా అనుపమా పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన మూడు వరుస పోస్టులు మాత్రం ‘ఔను… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. ’ అని చెప్పకనే చెబుతున్నాయి. హార్ట్ సింబల్‌లో I అని, A N J అని, “You” అని రాసి మూడు వరుస పోస్టులు పెట్టింది. అసలే అవకాశం కోసం ఎదురు చూసే బ్లాగర్లు దీన్ని వదులుతారా? అంతే… A N J అంటే అనుపమ అండ్ జస్ప్రీత్ అని నిర్ధారించేశారు. సో అనుపమా లవ్స్ జస్ప్రీత్ అనేది కన్ఫమ్ అయినట్టే.. త్వరలో ఇక పెళ్ళి బాజాలు మోగినట్టే అని రాతలు మొదలెట్టేశారు.