మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఏడాది ఆగష్టు నెలలో ఈమె ‘కార్తికేయ-2’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా అనంతరం నిఖిల్, అనుపమ ’18 పేజెస్’తో ఇద్దరూ మొదటి రోజు బ్రేక్ ఈవెంట్ సాధించి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇలా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అనుపమ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.
తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా అనుపమ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ’18 పేజెస్’ కథను పల్నాటి సూర్యప్రతాప్ గారు కొంతసేపు చెప్పగానే నాకు నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలనే నిర్ణయించుకున్నానని చెప్పింది. షూటింగ్ లు లేకపోతే ఇల్లే నాలోకంగా మారిపోతుంటుంది.
అసలు మేకప్ జోలికి పోను. రకరకాల హెయిర్ స్టైల్స్ తో ప్రయోగాలు చేస్తుంటా. చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు అందం కోసం మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు అని అడుగుతుంటారు. వాస్తవానికి నేనెలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోను.
నా దృష్టిలో అందమంటే పైపై మెరుగులు కాదు. లోపల మనసు ప్రశాంతంగా ఉండాలి. నిజానికి నాకు ఏది ఇష్టమనిపిస్తే అది తినేస్తాను. బయట నేను చాలా సింపుల్ గా ఉంటాను. పాజిటివ్ గా ఆలోచించడం .. ప్రశాంతంగా ఉండటం నాకు అలవాటు అంటూ చెప్పుకొచ్చింది.