అనుపమ పరమేశ్వరన్…అందంతో పాటు మంచి నటన కూడా ఆమె సొంతం. అయినా అనుపమకు మాత్రం రావల్సినంత క్రేజ్, పేరు రాలేదు. అయితే నాకు ఇవేమీ పట్టవు… నా పని నేను చేసుకుని పోతా అన్నట్లుగా తన పని చేసుకుంటుంది అనుపమ. చిన్న సినిమానా… పెద్ద సినిమానా… అన్న తేడా లేకుండా కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తుంది.
ఇటీవలే రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జతగా నటించేందకు ఒప్పుకున్న అనుపమ… తాజాగా మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు సమాచారం. నిఖిల్, చందూ కాంబినేషన్ల్ వచ్చిన కార్తికేయ ఎంత మంచి హిట్ కొట్టిందో అందిరికీ తెలిసిందే. ఇప్పుడా చిత్రం సీక్వెల్ రాబోతుంది. కార్తికేయ-2లో హీరోయిన్‌గా అనుపమ చేయబోతుందని తెలుస్తోంది. కథతో అనుపమను సంప్రదించగానే వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తుంది.
సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటు వెళ్లిపోతున్న అనుపమకు ఈ రెండు కొత్త చిత్రాలు ఎంతవరకు హిట్ ఇస్తాయో చూడాలి.