అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. కేరళలో ఈ సినిమా అదరగొట్టడంతో అనుపమకు తెలుగులో కూడా వెతుకుంటూ అవకాశాలు వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోని అ,ఆ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది అనుపమ. ఆ తరువాత వచ్చిన అవకాశాలతో తెలుగులో సినిమాలు చేస్తూనే వస్తోంది. అనుపమ కెరీర్ మొదట్లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన శతమానం భవతి సినిమా చేసింది. ఆ సంవత్సరం ఈ సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా నిలవడంతో అనుపమ కెరీర్ కు అడ్వాంటేజ్ అయింది.
శతమానం భవతి సినిమాలో అవకాశం ఇచ్చిన దిల్ రాజు నిర్మాణంలోనే వచ్చిన మరో సినిమాల్లో ఛాన్స్ దక్కించుంది అనుపమ. రామ్ హీరోగా వచ్చిన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో నటించింది ఈ భామ. అయితే ఆ సినిమా పెద్దగా అలరించకపోవడంతో అనుపమకు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలోనే ఆమె సినిమాలు ప్లాప్ టాక్ మూటగట్టుకోవడంతోపాటు సినిమా అవకాశాలు కూడా పెద్దగా పలరించకపోవడంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్తారని ప్రచారం సాగింది. కానీ ఆమె మరోసారి దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చిందని సమాచారం.
కొత్త హీరోతో కొంత ఫేమ్ ఉన్న హీరోయిన్స్ సినిమా చేసేందుకు అంగీకరించరు. కానీ అనుపమ మాత్రం తనకు నటిగా ప్రూవ్ చేసుకునేందుకు మరో అవకాశం దొరికినట్లుగా భావించి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.