సూపర్ హిట్టయిన డీజే టిల్లు సినిమాకు వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేశారు. దానికి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి సిద్ధు రిలీజ్ చేసిన వీడియో కూడా పెద్ద హిట్టయింది. ఇలా అంతా సెట్ అనుకున్న టైమ్ లో హీరోయిన్ వ్యవహారం ఈ సినిమాను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
టిల్లు స్క్వేర్ సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెతో 5 రోజులు షూటింగ్ కూడా చేశారు. అంతలోనే ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది.
శ్రీలీల తప్పుకున్న వెంటనే అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెతో కూడా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక అంతా సెట్ అనుకున్న టైమ్ లో ఇప్పుడు ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మడొన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారు.
ఇలా టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఇద్దరు హీరోయిన్లు తప్పుకోగా, ఇప్పుడు మడొన్నా వచ్చి చేరింది. ఈమైనా ప్రాజెక్టులో ఉంటుందా, కొన్ని రోజుల తర్వాత సైడ్ అయిపోతుందా అనేది చూడాలి. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకిలా హీరోయిన్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారనేది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్.