హరీష్ కొనగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ లుక్స్ అన్ని ఆకట్టుకున్నాయి.
కాగా తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో ఎప్పుడు ఏ సినిమాలో కనిపించని విధంగా లిప్ లాక్ సీన్ లో కనిపించింది అనుపమ.
అయితే ఈ సీన్ పై రకరకాల మీన్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇదే విషయంపై స్పందించారు అనుపమ. నవ్వుతూసినిమాలో తన పాత్రను ముద్దు పెట్టింది ఆశిష్ పాత్ర అని… సినిమాలోని ఆ సీన్స్ చూస్తే నెటిజన్లు మనసు మార్చుకుంటారని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను కుడ్ విడుదల చేశారు అనుపమ అండ్ ఆశిష్.