హీరోలు లిక్కర్ బ్రాండ్స్ ప్రమోట్ చేయడం కొత్త కాదు. చాలామంది హీరోలు ఈ పని చేశారు. బాలయ్య లాంటి హీరోలైతే తన టాక్ షోకు వచ్చిన ప్రతి సెలబ్రిటీని లిక్కర్ బ్రాండ్ అడిగి మరీ తెలుసుకున్నారు. ఆయన స్వయంగా మేన్సన్ హౌజ్ తాగుతానని ప్రకటించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలామంది బాలీవుడ్ భామలు మద్యం బ్రాండ్లను ప్రచారం చేశారు. టాలీవుడ్ హీరోయిన్లలో మాత్రం ఈ పోకడ తక్కువే.
మొన్నటికిమొన్న హీరోయిన్ పూజా హెగ్డే ఓ మద్యం బ్రాండ్ కు ప్రమోషన్ కల్పిస్తే, రోజంతా ట్రోల్ చేశారు నెటిజన్లు. అలా ప్రమోట్ చేసినందుకు ఆమెకు భారీగానే గిట్టుబాటు అయింది. దీంతో పూజా హెగ్డే, ఆ ట్రోలింగ్ ను పట్టించుకోలేదు. అయితే ఎలాంటి ప్రమోషన్ చేయకుండా, ఏ రెమ్యూనరేషన్ లేకుండా ట్రోలింగ్ కు గురైంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.
అవును.. తాజాగా ఇనస్టాలో ఓ పోస్ట్ పెట్టింది అనుపమ. ఈ ఆహ్లాదకరమైన రాత్రులు వైన్ కోసమే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది అనుపమ. అక్కడితో ఆగకుండా వైన్ తాగకముందు, తాగిన తర్వాత అంటూ 2 ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఓ ఫొటోల ఏకంగా వైన్ గ్లాస్ కూడా కనిపిస్తోంది. దీంతో అనుపమపై ట్రోలింగ్ మొదలైంది. నిజానికి ఇది మద్యం ప్రమోషన్ కాదు, అయినప్పటికీ అనుపమకు చీవాట్లు తగ్గలేదు.
మొన్నటివరకు సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ మలయాళీ బ్యూటీ, ఈమధ్య కాస్త బోల్డ్ అయింది. రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా లిప్ కిస్సులు పెట్టింది. పడక సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఆ బోల్డ్ నెస్ ను అలానే కంటిన్యూ చేసే ఉద్దేశంతో, ఇలా వైన్ స్టేట్ మెంట్ ఇచ్చింది ఈ అమ్మడు. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో అనుపమ నుంచి మరిన్ని బోల్డ్ స్టేట్ మెంట్స్, ఫొటోలు చూడొచ్చు అనిపిస్తోంది.