సూపర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన బ్యూటీ అనుష్క. ఆ తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ అరుంధతి సినిమా మాత్రం అనుష్క కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
అయితే తమిళంలో ఈ అమ్మడు ఓ సినిమాకు ఒకే చెప్పిందట. విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ఈ సినిమా కోసం అనుష్క రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. మొదట రూ. 3 కోట్లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు నిరాకరించినట్టు తెలుస్తోంది. చిత్రంలో నటించనున్న విజయ్ సేతుపతి రూ. 10 కోట్లు పారితోషికం ఇస్తుండగా తనకు రూ. 3 కోట్లు ఇవ్వడం న్యాయం అని అనుష్క డిమాండ్ చేసినట్టు తెలిసింది. దాంతో చేసేది లేక స్వీటీ డిమాండ్ కు ఒపుకున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.