మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
అయితే, ‘ఆచార్య’ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో మెరవనుందని నెట్టింట వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్‌లో హీరోలతో పాటు క్రేజ్ ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించటం మానేసింది. చివరగా 2020లో వచ్చిన నిశ్శబ్దం చిత్రంలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు చిత్రాలకు దూరంగా ఉంది.
ఈ క్రమంలో ‘ఆచార్య’ అనుష్క కామ్రేడ్ రాములక్కగా కనిపించబోతున్నట్టు సమాచారం. సెకండ్ హాఫ్‌లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే కొన్ని సీన్లలో తన క్యారెక్టర్‌ని స్పెషల్ గా డిజైన్ చేశారట దర్శకుడు కొరటాల శివ. ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నారట. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక, ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కాజల్ కొంతవరకు షూటింగ్‌లో కూడా పాల్గొంది. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఈ సినిమాను పూర్తి చేయలేకపోయింది. మరోవైపు నక్సలిజం బ్రాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి హీరోయిన్, రొమాన్స్ ఉంటే సెట్ కాదని డైరెక్టర్ కొరటాల కూడా భావించారు. దీంతో ఆమె పాత్రను ఈ సినిమా నుండి డిలీట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు.