కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తూ ప్రత్యేకత చూపిస్తున్న హీరోయిన్ అనుష్క. అరుంధథి, భాగమతి, పంచాక్షరి, నిశబ్ధం వంటి సినిమాలతో టాలీవుడ్ లో అందరికన్నా భిన్నంగా ముందుకు సాగుతుంది.
అయితే, చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసేందుకు అనుష్క ఓకే చెప్పింది. అనుష్క కథానాయికగా యూవీ క్రియేషన్స్ ఓ సినిమాని రూపొందిస్తుంది. పి.రమేష్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియేంటెడ్ సినిమాగానే తెరకెక్కనుంది. ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించేలా రాబోతుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.