బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అనుష్క శర్మ సినిమాల్లో రీఎంట్రీకి సిద్ధమైంది. తన కమ్‌బ్యాక్ మూవీగా తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రలో నటిస్తున్నట్లు అనుష్క ప్రకటించింది.
అప్పటి నుంచి అందరి దృష్టి అనుష్కపైనే ఉంది. అయితే.. ఈ సినిమా ఇన్నిరోజులు ఎందుకు వాయిదా పడిందనేది అందరిలో ప్రశ్నార్ధకంగానే మిగిలింది. దానికి అనుష్క పులిస్టాప్ పెట్టింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమాకు సంబంధించిన అనుభవాలను తన అభిమానులతో పంచుకుంది.
ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నిజంగా భయపడ్డానని చెప్పింది. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత తన ఫిట్‌నెస్ కోల్పోయానని తెలిపింది. పైగా 18 నెలలు శిక్షణ తీసుకునే స్థితిలో తన శరీరం లేదని ఆవేదన చెందింది. జిమ్‌లో వ్యాయామాలు చేయడంలో నిజంగా ఒత్తిడి ఎదుర్కొన్నానని వెల్లడించింది. కానీ తన మనసు మాత్రం ఈ సినిమా చేయాలని.. ఇందులో కచ్చితంగా భాగం కావాలని చెప్పిందని వెల్లడించింది.
కాగా ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క శర్మ సంబంధిత టీజర్ తో ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర కథను గొప్పగా పేర్కొన్న అనుష్క.. ఇది మహిళా క్రికెట్ గురించి ప్రపంచం కళ్లు తెరిపిస్తుంది’ అంటూ నోట్ షేర్ చేసింది.