హీరోయిన్ అనుష్క వెండి తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. 2021లో తన సినిమాలకు సంబంధించి రెండు అప్డేట్స్ ఉంటాయని అనుష్క ప్రకటించింది. కానీ అలాంటిదేమీ లేదు. తాజా సమాచారం ప్రకారం అనుష్క చంద్రముఖి సీక్వెల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ లో రాఘవ లారెన్స్ నటించనున్నారట. దర్శకుడు పి.వాసు మొదట రజినీకాంత్ సంప్రదించగా…డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేనన్నారట రజినీకాంత్.
Advertisements
ప్రస్తుతం చంద్రముఖి 2ను తెరకెక్కించడానికి దర్శకుడు పి వాసు సిద్ధంగా ఉన్నారు. రాఘవ లారెన్స్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది.