క్రేజ్ లో ఉన్న ఓ పెద్ద హీరోయిన్ తప్పుకుంటే, ఆటోమేటిగ్గా ఆమె వెనక ఉన్న హీరోయిన్లు పండగ చేసుకుంటారు. అనుష్క విషయంలో అదే జరుగుతోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అనుష్క, సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చేయాల్సిన సినిమా మాత్రమే ఉంది. అది కూడా గతంలోనే కమిట్ అయింది కాబట్టి చేస్తోంది. లేదంటే అది కూడా లేనట్టే.
ఇలా ఉన్నఫలంగా అనుష్క తప్పుకోవడంతో, అది కొంతమంది హీరోయిన్లకు వరంగా మారింది. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తయారుచేసుకున్న మేకర్స్ అంతా.. అనుష్క అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు కీర్తిసురేష్ వెంట పడుతున్నారు. కీర్తిసురేష్ కాల్షీట్లు దొరకని వాళ్లు.. తమన్న, త్రిష వెంట పడుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో సమంత టాప్ లీగ్ లో కొనసాగుతోంది. అనుష్క కోసం అనుకున్న సినిమాలన్నీ సమంతను వరిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తోంది. నిజానికి ఆ ప్రాజెక్టును అనుష్క కోసమే అనుకున్నారు. కానీ అనుష్క ఓకే చెప్పకపోవడంతో ఆ ఆఫర్ సమంతను వరించింది.
ఇలా అనుష్క రేస్ నుంచి తప్పుకోవడంతో కీర్తిసురేష్, సమంత, త్రిష, తమన్న లాంటి ఎంతోమంది ముద్దుగుమ్మలు పండగ చేసుకుంటున్నారు. కాజల్ గర్భం దాల్చి సినిమాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవడంతో, వీళ్లకు మరింతగా కలిసొచ్చింది.