అనుష్క మూగ అమ్మాయిగా నటించిన చిత్రం నిశబ్ధం. సినిమా షూటింగ్ అంతా దాదాపు అమెరికాలోనే షూట్ చేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా… ఈ సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. రోజుల వ్యవధిలో సినిమా రిలీజ్ అవుతుందనగా, లాక్ డౌన్ పడటంతో విడుదల వాయిదా పడింది. దాంతో ఆ రోజు నుండి నేటి వరకు డిజిటల్ రిలీజ్ పై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… నిశబ్ధం మూవీ అక్టోబర్ 2న సాయంత్రం అమెజాన్ ప్రైంలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెజాన్ సంస్థ 24కోట్లు చెల్లించనుందని సమచారం. ఈ సినిమాను 30కోట్ల బడ్జెట్ తో పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్లు నిర్మించాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం రైట్స్ కూడా ఇందులో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.