బాహుబలి సినిమా తరువాత అనుష్క భాగమతి సినిమా మాత్రమే చేసింది. బాహుబలి క్రేజ్ తో అనుష్క వరుస సినిమా అవకాశాలతో బిజీ అవుతుందనుకుంటే ఒక్క సినిమా మాత్రమే చేసింది స్వీటీ. ఇక ఈ ఏడాది నిశ్శబ్దం సినిమాతో పలకరించనుంది అనుష్క. ఈ సినిమా అనంతరం ఆమె కథల ఎంపికలో జాగురకతతో వ్యవహరిస్తునట్టు అర్ధం అవుతోంది.
దక్షిణాది భామలంతా రజనీకాంత్ సినిమాలో ఒక్కసారైనా నటించాలని చాలా ట్రై చేస్తుంటారు కానీ అనుష్కకు అలాంటి అవకాశం వచ్చిన కూడా రిజెక్ట్ చేసిందట. ఆమె చేయాల్సిన కొచ్చాడియాన్ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అనుష్క ఈ సినిమా చేయకుండా మంచి పని చేసిందని అంటున్నారు.
ఇక అనుష్క మణిరత్నం తెరకెక్కించబోతున్న పొన్నియన్ సెల్వం, విక్టరీ వెంకటేష్ నటిస్తున్ననారప్ప సినిమాలో నటించేందుకు కూడా నో చెప్పిందట. తమిళంలో అదరగొట్టిన అసురన్ మూవీకి నారప్ప రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నారప్ప చిత్రంలో అనుష్కను నటించాలని కోరగా.. ఆమె నిరాకరించిందట. అనుష్క రిజెక్ట్ చేయడంతోనే ఆమె ప్లేసులో ప్రియమణిని తీసుకున్నారని టాక్.
తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య సినిమాలో నటించించేందుకుగాను అనుష్కను సంప్రదించినట్టు సమాచారం. త్రిష ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అనుష్కను చిరు సరసన నటించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మరి ఆమె ఒకే చెప్తారో లేదో చూడాలి