యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదట కీర్తి సురేష్ , కీయరా అద్వానీ, మాజీ మిస్ ఇండియా ఊర్వశి వంటి పేర్లు తెరమీదకు వచ్చాయి తాజాగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పేరు తెరమీదకు వచ్చింది.
ఇటీవల అనుష్క శర్మకు దర్శకుడు కథ చెప్పినప్పుడు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం అనుష్క గర్భవతి. అయితే వచ్చే ఏడాది జనవరి కల్లా డెలివరీ అవుతుందని కోహ్లీ ఇప్పటికే ప్రకటించడం… ఆది పురుష్ కూడా జనవరిలోనే ప్రారంభించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సినిమాలో సీతగా అనుష్క శర్మను ఓకే చేసారని సమాచారం.