బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి నటిగా తానేంటో నిరూపించుకుని లక్షలాది మంది అభిమానుల అభిమానాన్ని పొందింది. ఇక ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో ప్రేమలో పడింది. ఆ తరువాత పెళ్లి కూడా చేసుకుంది.
అయితే ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి. ఇంకొన్ని రోజులలో తల్లికూడా కాబోతోంది. ఇటువంటి సమయంలో అనుష్క సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం అనుష్క శర్మ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఈ ఫోటో నా కోసం, నా లైఫ్ కోసం…ఎంతో సంతోషాన్నిచ్చింది అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క శర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.