ఈరోజుల్లో సోషల్ మీడియా వేదికగా చాలామంది వారి ప్రతిభను చూపిస్తూ సెలబ్రిటీ స్టేటస్ ను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటికే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వారి పిల్లలకు సోషల్ మీడియా అదనంగా ఉపయోగపడుతోంది. కానీ, ఇండియన్ స్టార్ క్రికెటర్ కోహ్లీ దంపతులు మాత్రం తమ కుమార్తె వామికను బయటప్రపంచానకి తెలియకుండా పెంచాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వామిక పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. తన కుమార్తె ఫోటోలు వీడియోలు కానీ బహిర్గతం చేయకుండా మాకు సహకరించినందుకు మీడియాకు, సోషల్ మీడియా కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది
.
ఇటీవల కోహ్లీ-అనుష్క.. వామికతో కలిసి బయటికి వెళ్లినప్పుడు మీడియా కొన్ని ఫోటోలు తీసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అప్పట్లో కూడా కోహ్లీ దంపతులు తన కుమార్తె ఫోటోలు బయట పెట్టొద్దని కోరారు. వారు కోరుకున్న విధంగానే ఫోటోలు బయటకు రాలేదు. దీంతో అనుష్క ఈ విధంగా పోస్ట్ చేసింది. “వామిక జీవితం మీడియాకు దూరంగా, స్వేచ్ఛగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.. దానికోసం మేము చాలా కృషి చేస్తున్నాం. మా కృషికి మీరు సహాయం అందించాలని కోరుతున్నా.. ఇప్పటివరకూ మా చిన్నారి ఫోటోలు బయటపెట్టకుండా ఉన్నందుకు మీకు మా కృతజ్ఞతలు తెలుపుతున్న” అని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.