టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క శెట్టి రెండేళ్ల తర్వాత బయటకు వచ్చింది. ‘బాహుబలి’ మూవీ తర్వాత అనుష్క పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాకి కూడా ఆమె దూరంగా ఉంటుంది. తాజాగా అనుష్క కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులకు దేవసేన కనిపించిందంటూ హ్యాపీ ఫీలవుతున్నారు.
శివరాత్రి సందర్భంగా అనుష్క బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది. వైట్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్న అనుష్క.. కాస్త బొద్దుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైర ల్‌గా మారాయి. ఈ ఫొటోలను అభిమానులందరూ విపరీతంగా షేర్ చేస్తున్నారు.
దాదాపుగా రెండేళ్ల తర్వాత ఆమె బయటకు రావడం చెప్పుకోదగ్గ విశేషం. చివరగా స్వీటీ ‘నిశ్శబ్ధం’ లో నటించారు. ఈ చిత్రం 2020లో ప్రైమ్ లో విడుదల కాగా.. ప్రమోషన్స్ లో పాల్గొంది. అనంతరం ఏ వేదికపైనా అనుష్క కనిపించలేదు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. అనుష్క ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తుంది. ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ ఖరారు చేశారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు.