అనుష్క… ఈ పేరు వింటే కుర్రాళ్ల మతిపోతుంది అనటం లో సందేహం లేదు. సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, ఈ పొడుగు సుందరి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందింది. అంతే తన అందంతో, అభినయంతో… ఇక వెనక్కి తిరిగి చూడలేదు. నాటి నుండి నేటి వరకు అన్ని రకాల సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ అమ్మడు.
అనుష్క కెరీర్ లో అరుంధతి సినిమా ఒక మైలురాయి అని చెప్పొచ్చు. జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ అమ్మడు ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డుని సైతం అందుకుంది. దీనితో పాటు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు లు నంది అవార్డులు జెలుచుకుంది.
35 సంవత్త్సరాల వయసు పైబడిన తన క్రేజ్ మాత్రం ఇండస్ట్రీలో తగ్గలేదు. అప్పట్లో లేడీ అమితాబ్ విజయశాంతి తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క. అరుంధతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసి బిల్లా సినిమాలో బికినిలో అందరిని తనవైపుకు తిప్పుకుంది. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి సినిమా అనుష్క స్థాయిని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ అమ్మడు నిశ్శబ్ధం అనే సినిమాలో నటిస్తుంది. అనుష్క ఇందులో చెవిటి, మూగ యువతిగా గా ప్రేక్షకుల ముందుకు రానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో అంజలి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. నేటితో అనుష్క 39వ బర్త్‌డే జరుపుకుంటోంది.