అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ వీడింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల రీత్యా వాయిదా పడింది. హేమంత్ దర్శకత్వంలో నిశ్శబ్దం చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అనుష్క క్యారెక్టర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచారు. ఈ సినిమాలో ఆమె మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో కనిపిస్తున్నారు. అనుష్కతోపాటు ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ లు నిర్మించారు. భాగమతి సినిమా తరువాత అనుష్క నటిస్తోన్న సినిమా కావడంతో నిశ్శబ్దంపై భారీగానే అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఎంతమేరకు అభిమానులను మెప్పిస్తుందో చూడాలి.