నిశబ్ధం సినిమా తర్వాత వెయిట్ లాస్ ఇష్యూస్ తో కొత్త సినిమాలేవీ ఒప్పుకోని హీరోయిన అనుష్క. అయితే, త్వరలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానని చెప్పినప్పటికీ సినిమా ఏదీ ఫైనల్ చేయలేకపోయింది. కానీ యూవీ క్రియేషన్స్ లో సినిమా చేస్తానని ఇప్పటికే కమిట్ అయ్యింది.
సందీప్ కిషన్ హీరోగా రా రా కృష్ణయ్య సినిమా చేసిన మహేష్ అనే ప్లాప్ డైరెక్టర్ తో అనుష్క సినిమా చేయనుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా మూవీ రాబోతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండనుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే కథలో బలం, టేకింగ్ లో నైపుణ్యం చాలా అవసరం. ఏమాత్రం తేడా వచ్చిన సినిమా పోయినట్లే… కానీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మూవీ ఇవ్వటం అంటే అన్ని ఆలోచించే చేస్తారు. దాంతో ప్లాప్ డైరెక్టర్ గా ముద్రపడ్డ మహేష్ తో సినిమాకు స్వీటీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.