రాచకొండ కీసర పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలని డెడ్ బాడీ తో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు బాధిత కుటుంబ సభ్యులు.
రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న మనోజ్(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యాక్సిడెంట్ కు కారణం అయిన కారు నడుపుతున్న వ్యక్తిపై బాధితుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. ఘటన జరిగి రెండు రోజులు అయినప్పటికీ.. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేయకుండా.. వారికి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. రాజకీయ నాయకులకు భయపడి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ఈ యాక్సిడెంట్ కు కారణం అయిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి సన్నిహితుడు కావడంతో.. నిందితున్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు మృతుని బంధువులు. ఆందోళన కారులను లాఠీలతో చెదరగొట్టడంతో.. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.