కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ లాక్ డౌన్ ఆయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఏపీలో 31న జరగాల్సిన పది పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు వారాల పాటు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మార్చి 31 తరువాత పరిస్థితుని సమీక్షించి..పరీక్ష నిర్వహణ తేదీలను వెల్లడిస్తామని వెల్లడించారు.
అయితే మరో వారం రోజుల్లోనే కరోనా తగ్గుముఖం పట్టడం ప్రస్తుత పరిస్థితులను చూస్తే అసాధ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను క్రమశిక్షణతో ప్రజలు పాటిస్తే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పెట్టె ఛాన్స్ ఉందని అంటున్నాయి వైద్య వర్గాలు..