తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలుండగా వాటిని 25 చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టు ఎం.పి.విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో జగన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ…విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనే నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు.
మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 3 రాజధానులు వస్తున్నాయని తెలిపారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరగని అభివృద్ధి జగన్ 5 నెలల్లోనే చేసి చూపించారని వెల్లడించారు.