ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. అదే సమయంలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మండలి సమావేశాలు కూడా 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 3 రాజధానులకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే దిశగా వైసీపీ సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా పలు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
బ్యాంకుల సహకారంతో చేపట్టిన పనులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో రుషికొండ పై చేపట్టిన పనులు ప్రతిపక్షం ప్రస్తావించే అవకాశాలున్నాయి.
అమరావతి రైతుల సమస్యల పై విపక్షం ప్రభుత్వాన్ని శాశన సభలో చర్చకు పట్టుపట్టే అవకాశాలున్నాయి