అమరావతిలోనే రాజధాని కొనసాగాలని, ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షకు దిగారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన దీక్షకు కూర్చున్నారు. దీక్షకు పలువురు బీజేపీ నేతలు మద్దతు పలుకుతుండగా… గంట పాటు కన్నా మౌనదీక్ష కొనసాగబోతుంది.